SRPT: శాంతి భద్రతల పరిరక్షణలో, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి సమాజాన్ని రక్షించేందుకు పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరవీరుల స్థూపానికి ఎస్పీ నివాళులర్పించారు. పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం విధులు నిర్వహిస్తారన్నారు.
తెలంగాణ
'పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం'


