ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ బుధవారం మొదలైంది. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని ఎస్ఐ రాజారెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కునూరులో ఎంపీటీసీ నామినేషన్లు


