హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ బోణీ?

కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో 25వ వార్డు టీడీపీ అభ్యర్థి కురసాల సురేష్ నాయుడు ఏకగ్రీవం కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థి రాజా, వైసీపీ అభ్యర్థి కురసాల బద్దాజీ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఆయన ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఎన్నికల అధికారుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.