హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం: సీపీ

MNCL: ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని రామగుండం సీపీ అన్నారు. 1959 అక్టోబర్ 21న సీఆర్‌పీఎఫ్ జవాన్లు చేసిన త్యాగాలకు గుర్తుగా ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తూ శాఖ గౌరవాన్ని పెంపొందించాలని సూచించారు.