హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోటీకి జంకుతున్న నేతలు

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థుల కొరత రాజకీయ పార్టీలకు సవాలుగా మారింది. ఎన్నికల ఖర్చులు పెరగడం, రాజకీయ ప్రాధాన్యం తగ్గిందనే అభిప్రాయాలతో పలువురు నేతలు పోటీకి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. MPTCకి రూ.20 లక్షలు, ZPTCకి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందన్న అంచనాలు అభ్యర్థులను ఆలోచనలో పడేస్తున్నాయి.