WG: వీరవాసరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. వీరవాసరం ఎంపీపీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీసీ జనరల్‌కు కేటాయించిన పంజావేమవరం ఎంపీటీసీ స్థానానికి కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి మళ్ల శ్రీరామమూర్తి తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి కె. అప్పారావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వీరవాసరంలో తొలి నామినేషన్ దాఖలు


