హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి: పోలు వరలక్ష్మి

ప్రకాశం: టీడీపీ నాయకులే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను ప్రకటించుకుంటే ఎన్నికలు నిర్వహించడం ఎందుకని పెద్దచెర్లపల్లి మండల ఎంపీపీ అభ్యర్థి పోలు వరలక్ష్మి ప్రశ్నించారు. బుధవారం ఎంపీటీసీగా నామినేషన్ వేసి వెళ్తుండగా టీడీపీ నాయకులు తన నామినేషన్ పత్రాలను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఆమె కోరారు.