MDK: మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో బతుకమ్మ ఊరేగింపు సందర్భంగా దళితులపై దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రజాసంఘాల నాయకులు బుధవారం గ్రామాన్ని సందర్శించారు. ఆదివారం జరిగిన ఘర్షణలో సర్పంచ్ వర్గం దళితులపై దాడి చేసిందని ఆరోపిస్తూ బాధితులను పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
దళితులపై దాడి.. బాధితులకు పరామర్శ


