హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేత

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. వరద కాలువ ద్వారా 19 రోజుల పాటు కొనసాగిన నీటి విడుదలను సైతం ఆపేశారు. 80 TMCల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 36 TMCల నీరు నిల్వ ఉంది. గత 3 నెలలుగా కాకతీయ,లక్ష్మీ కాలువల ద్వారా కొనసాగించిన నీటి సరఫరాకు స్వస్తి పలికారు.