హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరికుంటపాడు ఎంపీపీ కూటమి అభ్యర్థిగా చండ్ర

NLR: వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో వరికుంటపాడు మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా చండ్ర మధుసూదన్ రావును ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.