హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నాయకుడిపై కత్తితో దాడి

JGL: కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా మొదలైన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకుడు గుద్దేటి రాజేందర్‌పై కొందరు యువకులు కత్తితో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. గాయపడిన రాజేందర్‌ను చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించారు.