హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాచుపల్లి ఎంపీటీసీకి రెండు నామినేషన్లు

సిద్ధవటం మండలం మాచుపల్లి ఎస్సీ జనరల్ ఎంపీటీసీ స్థానానికి కోటపాటి మధు, కేశపాటి రామయ్య నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల ప్రక్రియను రాజంపేట డీఎస్పీ వెంకటరామయ్య పరిశీలించారు. ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై హారిక పాల్గొన్నారు.