ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం పర్యాటకులతో బుధవారం సందడిగా మారింది. ఆలయ పూజారి ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గైడ్ కాకతీయుల శిల్పకళా వైభవం, ఆలయ విశిష్టతను వివరించడంతో పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు.
తెలంగాణ
రామప్పలో పర్యాటకుల సందడి


