ASR: వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని చింతపల్లి సీఐ బీ.సింహాచలం సూచించారు. ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం చింతపల్లి వారపుసంతలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకుని, ఎల్ఎల్ఆర్ పొంది, అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి'


