హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి 10 కుటుంబాలు చేరిక

పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామానికి చెందిన టీడీపీ, జనసేనకి చెందిన 10 కుటుంబాలు బుధవారం వైసీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే,అలజంగి జోగారావు వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.