హైదరాబాద్: 28°C
తెలంగాణ

33 ఏళ్లకే దేశం కోసం ప్రాణత్యాగం: ఎంపీ

VKB: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా తన స్కూల్ జూనియర్, ఐపీఎస్ అధికారి సి. ఉమేష్ చంద్ర త్యాగాన్ని స్మరించుకున్నారు. 1999 సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో నక్సలైట్ల దాడిలో 33 ఏళ్ల వయసులోనే అమరుడైన ఆయన దేశం కోసం చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసుల ధైర్యసాహసాలను కొనియాడారు.