హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియపై జేసీ పరిశీలన

ASR: నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల ముగింపు వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ సూచించారు. రంపచోడవరంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.