హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మారేడుమిల్లిలో నామినేషన్ల ప్రక్రియ పరిశీలన

పోలవరం: మారేడుమిల్లి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్‌ కె. దినేష్ కుమార్, ఎస్పీ కె. చక్రవర్తి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణను ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.