విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం పోలీసు సంస్మరణ దినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జడ్జి బబిత, కలెక్టర్ రామసుందర్ రెడ్డి, SP దామోదర్ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోగా, జిల్లాకు చెందినవారు తొమ్మిది మంది ఉన్నారని SP తెలిపారు. ఇద్దరు అమరవీరుల కుటుంబాలను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు అమరవీరులకు ఘన నివాళి


