హైదరాబాద్: 28°C
క్రీడలు

53 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. క్రీడలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే భారత్ ఏకంగా 53 పతకాలను సాధించింది. ఇందులో 14 స్వర్ణాలు, 19 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా, 178 పతకాలతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఉజ్బెకిస్తాన్ (72), జపాన్ (75) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.