హైదరాబాద్: 28°C
క్రీడలు

11 వేల పరుగుల క్లబ్‌లో స్టీవ్ స్మిత్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 127 టెస్టుల్లోనే అతడు ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో ఇప్పటివరకు రికీ పాంటింగ్ (13,378), అలెన్ బోర్డర్ (11,174) మాత్రమే ఈ మైలురాయిని చేరుకోగా, ఇప్పుడు స్టీవ్ స్మిత్ మూడో ఆటగాడిగా నిలిచాడు.