హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ అలర్ట్.. ఈ రూట్లలో ఆంక్షలు!

MDCL: దుర్గామాత నిమజ్జనోత్సవం నేపథ్యంలో HYDలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్ 24 ఉదయం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.