హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో ఘనంగా దుర్గామాత నిమజ్జనం

CTR: పుంగనూరులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ముగిశాయి. బుధవారం సుబేదారి వీధిలో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాన్ని మార్వాడీ వర్గీయులు నిమజ్జనానికి తరలించారు. ట్రాక్టర్‌పై అమ్మవారిని కొలువుదీర్చి భక్తిగీతాలు, కోలాటాలు, నృత్యాల నడుమ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, మహిళలు మంగళహారతులతో మొక్కులు చెల్లించుకున్నారు.