MDK: జిల్లాలోని కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో కాంగ్రెస్, BRS వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి కారును ధ్వంసం చేయడంతో మొదలైన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘటనలో పలువురికి రక్తగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ బాలకృష్ణ, తొగుట సీఐ శ్రీనివాస్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తెలంగాణ
లకుడారంలో కాంగ్రెస్, BRS వర్గాల ఘర్షణ


