VZM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీఐ విజయకుమార్ బుధవారం తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రశాంతంగా నామినేషన్లు వేసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళి ఖచ్చితంగా పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నియమావళి ఖచ్చితంగా పాటించాలి'


