WG: ఉండి జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండికి చెందిన అడబాల శ్రీనివాసరావును ఎంపిక చేసినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గోపాలకృష్ణంరాజు తెలిపారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారాం తదితరుల సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శ్రీనివాసరావు బుధవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ZPTC కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాసరావు


