హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి'

KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అదనపు డీసీపీ వెంకటరమణ అమరవీరుల నామావళిని చదివి వినిపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల త్యాగాలు మరువలేనివన్నారు.