హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సుల కోసం ప్రయాణికుల అవస్థలు

GDWL: దసరా పండుగ అనంతరం ప్రయాణికులతో ఎర్రవల్లి మండల కేంద్రం రద్దీగా మారింది. ప్రధాన పట్టణాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణానికి బస్సులు లేక గంటల తరబడి వేచి చూశారు. వచ్చిన బస్సులు కూడా కిక్కిరిసిపోయాయని, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాల్సిందని ప్రయాణికులు వాపోయారు.