హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

కృష్ణా జిల్లా కలెక్టర్ చల్లపల్లి ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల విధుల్లో నామినేషన్ల నిబంధనలపై సూచనలు చేశారు. అనంతరం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, 26 మండలాలకు సంబంధించిన కౌంటర్లను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.