హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా అరుణ నామినేషన్

SS: ధర్మవరం మండలం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా అప్పిరెడ్డిగారి అరుణ పోటీలో నిలిచారు. ఈ సందర్భంగా ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై అరుణకు మద్దతు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా పలువురు నేతలు తెలిపారు.