KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర రావు బుధవారం సత్య నికేతన్ సత్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సత్రంలోని గదులు, పరిసరాలను పరిశీలించి పారిశుద్ధ్యం, భక్తులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు
ఆంధ్రప్రదేశ్
సత్య నికేతన్ సత్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈఓ


