హైదరాబాద్: 28°C
క్రీడలు

పాండ్యా.. నేరుగా ఐపీఎల్‌లోనే రీఎంట్రీ

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మరికొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అతడు పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడానికి చాలా సమయం పట్టనుంది. దీంతో రాబోయే శ్రీలంక, జింబాబ్వే సిరీస్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు నేరుగా ఐపీఎల్ 2027 సీజన్ ద్వారానే పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.