హైదరాబాద్: 28°C
క్రీడలు

'రో-కో'పై బీసీసీఐ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

రోహిత్, కోహ్లీల భవిష్యత్తుపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ఎంపికకు వయసుతో సంబంధం లేదని, కేవలం ఫిట్‌నెస్, ఫామ్ మాత్రమే ప్రామాణికమని స్పష్టం చేశారు. 2027 WCలో 'రో-కో' ఎంపికపై తుది నిర్ణయం పూర్తిగా సెలెక్షన్ కమిటీపైనే ఆధారపడి ఉంటుందన్నారు. అయితే, సౌతాఫ్రికాలో జరిగే ఈ ప్రపంచకప్‌లో వారిద్దరి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.