హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు అమరవీరులకు సీపీ నివాళి

విశాఖలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్మృతి స్థూపం వద్ద సీపీ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. 1961 నుంచి దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది దేశభద్రత కోసం ప్రాణాలర్పించారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా సీపీ కొనియాడారు.