హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు వేయాలని వీవర్స్ కాలనీవాసుల నిరసన

KRNL: ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పక్క వీధిలో రోడ్డు వేయాలని కాలనీవాసులు బుధవారం ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.