హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: కలెక్టర్

అనంతపురంలో మున్సిపల్ ఎన్నికల విధులపై పీఓలు, ఏపీఓలకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. పోలింగ్ ప్రక్రియపై పూర్తి బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.