హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌కు తుది జట్టులో చోటు కష్టమే: శ్రేయస్

రేపటి నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుందని తెలిపాడు. అతడు అవకాశాలు పొందడానికి చాలా సమయం ఉందన్నాడు. ఇప్పుడు జట్టుతోపాటు వైభవ్ విదేశాలకూ వస్తే పిచ్‌లపై ఎలా ఆడాలో ఓ అవగాహన వస్తుందని చెప్పుకొచ్చాడు.