హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం బుధవారం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి గణియా, పోలీసు అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజల రక్షణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.