హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో టీడీపీకి తొలి విజయం! 

W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి బత్తుల శ్యామల ఏకగ్రీవమైనట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి తిప్పా భవాని తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో శ్యామల ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో మొత్తం 28 వార్డుల్లో రెండు వార్డులు జనసేన, ఒక వార్డు టీడీపీ ఖాతాలో పడినట్లు సమాచారం.