హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ

మహబూబ్‌నగర్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి క్లాక్ టవర్, రామ్ మందిర్ చౌరస్తా మీదుగా పరదేశి నాయుడు సర్కిల్ వరకు స్మారక ర్యాలీ నిర్వహించారు.