హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పరిశీలించారు. ఎన్నికల నియమావళిని (MCC) కచ్చితంగా అమలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.