హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

JGL: జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ బీ.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.