హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్వరరావు, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ హాజరై అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.