హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రం వద్ద భారీ ర్యాలీ.. ట్రాఫిక్ క్లియర్

AKP: రోలుగుంట మండల పరిషత్ కార్యాలయం వద్దకు కుసర్లపూడి నుంచి పార్టీ శ్రేణులు బుధవారం భారీ ర్యాలీగా చేరుకున్నాయి. మద్దతుదారులు ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ కేంద్రం వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు.