హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: ఎస్పీ

GDWL: ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడటంలో పోరాడి అమరులైన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ ఏడాది 154 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులు అయ్యారని తెలిపారు.