హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో మరోసారి ఉద్రిక్తత

అన్నమయ్య: పుంగనూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పాటు కర్రలతో దాడులకు దిగినట్లు సమాచారం. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి మరింత అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీచార్జ్ చేశారు.