ప్రకాశం: తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు బుధవారం పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. దర్శిలో గతంలో జరిగిన ఘర్షణలు, ఎస్సైకి గాయాలు కావడంతో ఆ ప్రాంతాన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్


