హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల గుండెల్లో నిలిచిన ఎస్ఐ జాన్ విల్సన్

SDPT: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎస్ఐ జాన్ విల్సన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. 1991లో రామవరం వద్ద నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలుడులో సీఐ యాదగిరి, జాన్ విల్సన్‌తో పాటు మరో 13 మంది మృతి చెందారు. పెళ్లి శుభలేఖలు పంచేందుకు వచ్చిన జాన్ విల్సన్ ఈ ఘటనలో బలయ్యారు. హుస్నాబాద్‌లో ఏడాదిన్నరపాటు ఎస్ఐగా పనిచేసిన ఆయన పేదల పక్షపాతిగా గుర్తింపు పొందారు.