హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ దాడితల్లి ఆలయంలో 108 లీటర్ల పాలాభిషేకం

VZM: బొబ్బిలి పట్టణం బైపాస్‌ రోడ్డులోని శ్రీ దాడితల్లి ఆలయంలో ఇవాళ దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి 108 లీటర్ల పాలాభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. అర్చకుడు పిండిప్రోలు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.