హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

MDCL: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి CAR హెడ్ క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సుమతి స్వయంగా రక్తదానం చేసి అమరులకు నివాళులర్పించారు. రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.